బీజేపీ కౌంటర్ ఎటాక్ : పవన్ కల్యాణ్ నటన చూస్తే నవ్వొస్తుంది

kishan-reddyపవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్టింగ్ పై తీవ్ర కామెంట్స్ చేశారు బీజేపీ శాసనసభ నేత కిషన్ రెడ్డి. పవన్ కల్యాణ్ కు అసలు యాక్టింగే రాదని.. ఆయన హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. పవన్ నటనలో పరిపక్వత లేదన్నారు. హావభావాలు పలికించలేడని చెప్పారు కిషన్ రెడ్డి. అన్న చిరంజీవిని అడ్డంపెట్టుకుని సినిమా యాక్టర్ అయ్యాడని.. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అవుదాం అనుకుంటున్నాడు అంటూ ఎద్దేవ చేశారాయన. పవన్ కల్యాణ్ కంటే.. చిరంజీవి కుమారుడు రాంచరణ్ మంచి నటుడు అన్నారు.

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే హంగ్ వస్తుందని జోస్యం చెప్పారు. మార్చి నుంచి ప్రజల్లోకి వెళ్తామన్నారు. పాదయాత్ర చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బీజేపీలో ఇమడలేడని.. బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువన్నారు. తిట్లు, బూతులకు బీజేపీలో తావులేదంటూ రేవంత్ నోటి దురుసుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. పార్టీ సంప్రదాయం కాదని.. నాగం జనార్థన్ రెడ్డి, ఆయన కుమారుడికి ఇద్దరికీ టికెట్లు ఇచ్చామన్నారు. పార్టీలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి…

Posted in Uncategorized

Latest Updates