బీజేపీ చరిష్మా కోల్పోతోంది : రజినీకాంత్

ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. మంగళ వారం చెన్నై ఏయిర్ పోర్ట్ లో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ లాంటి ఎన్నికల్లో బీజేపీ సత్తా నిరూపించుకోలేకపోయిందని… తన చరిష్మాను కోల్పోయిందని తెలిపారు. ఇందుకు కాంగ్రెస్ గెలుపే ఓ నిదర్శనమని అన్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించిందని అది ప్రభుత్వ వ్యతిరికేతను చూపిస్తోందని చెప్పారు.

తనకు మోడీ మద్దతు ఉందన్న వాదనలను రజినీకాంత్ తోసిపుచ్చారు. తన వెనుక ఉన్నది ప్రజలు, ఆ దేవుడు మాత్రమే అని తెలిపారు. రాజకీయ పార్టీ ని ప్రకటించిన రజనీ ఇప్పటివరకు దాని పేరును మాత్రం ప్రకటించలేదు. దీంతో పాటే.. తమిళ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ‘కొత్త ఆరంభానికి ఇది సంకేతం..ఇది ప్రజల తీర్పు’ అని ట్వీట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates