బీజేపీ చూడు చూడు : ఒకే వేదికపై దేశంలోని ప్రతిపక్షాలు

రరబెంగళూరులో సత్తా చాటారు దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి కర్నాటక సీఎంగా ప్రమాణస్వీకారం అందుకు వేదిక అయ్యింది. కర్నాటక అసెంబ్లీ ఎదుట అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో సోనియాగాంధీ, రాహుల్ తోపాటు దేశంలో బీజేపీని ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ హాజరు అయ్యాయి. ఈ వేడుకలో సోనియా, రాహుల్ చొరవ తీసుకుని మరీ అందరి దగ్గరకు వెళ్లి పేరు పేరున పలుకరించారు. కుమారస్వామి వేడుక అనేకంటే.. విపక్షాల బలప్రదర్శన అనొచ్చు.

ఈ వేడుకకి కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్ తోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేష్ యాదవ్, బీహార్ నుంచి ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, NCP చీఫ్ శరద్ పవార్, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, యూపీ మాజీ సీఎం అజిత్ సింగ్, డీఎంకే నుంచి కణిమొళి హాజరయ్యారు. కుమారస్వామి, పరమేశ్వరన్ ప్రమాణస్వీకారం తర్వాత అదే వేదిక నుంచి అందరూ చేతులు.. చేతులు కలిపి అభివాదం చేయటం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు అయితే రాహుల్ గాంధీ ముందుకు పిలిచి మరీ చేతుల పట్టుకుని అభివాదం చేయటం హైలెట్ గా మారింది.

ఒకే వేదిక నుంచి దేశంలోని ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా బీజేపీకి సంకేతాలు పంపించినట్లు ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించినా.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అధికారంలోకి రావటం వెనక మా ఐక్యతకు సంకేతం అని అభివర్ణించారు నేతలు. 2019 ఎన్నికల్లోనూ ఇదే విధంగా ముందుకెళ్తాం అన్నట్లు చెప్పకనే చెప్పారు. మరి బీజేపీ ఈ ఐక్యతను ఎలా చూస్తుందో చూడాలి…

Posted in Uncategorized

Latest Updates