బీజేపీ మేలు కోసమే కేసీఆర్‌ ఫ్రంట్‌

హైదరాబాద్‌ : మోడీ వ్యతిరేక ఓట్లు చీల్చి, బీజేపీకి మేలు చేయడానికే సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌అంటున్నారని ఆరోపించారు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. చాలా రాష్ర్టాల ముఖ్యమంత్రులకు రోజుల తరబడి అపాయింట్‌మెం ట్‌ ఇవ్వని ప్రధాని మోడీ, కేసీఆర్‌ అడగ్గానే ఇస్తున్నారని, ఇది వాళ్ల మైత్రికి అద్దం పడుంతోందన్నారు. రాష్ర్టంలో కేసీఆర్ విధానాలపై వ్యతిరేకత ఉన్నా, రైతుబంధు, పింఛన్లు వంటి పథకాలు గట్టెక్కించాయన్నారు. ఎన్నికల్లో చంద్రబాబును చూపి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని, ఇదీ టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిందన్నారు.

నిన్న(సోమవారం) హైదరాబాద్ లో జరిగిన సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు . ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి గట్టిఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఇప్పటికే ఎన్ డీఏ నుంచి పలుపార్టీలు బయటకు వచ్చాయని, ఎన్నికల నాటికి మరిన్ని పార్టీలు బయటకు వచ్చే అవకాశముందని చెప్పారు . దేశంలో మహిళలు,దళితులు, మేధావులపై దాడులు జరుగుతున్నకేసీఆర్‌ మాత్రం స్పందించలేదని విమర్శిం చారు.ఫ్రంట్‌ కోసం ఆయన ఒడిశాకు వెళ్తే ఆ రాష్ర్ట సీఎం నవీన్‌ పట్నాయక్ ది ఒక మాట, కేసీఆర్‌ది మరో మాటలా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఆర్‌బీఐ, ఎన్నికల కమిషన్‌ వంటి సంస్థల్లో బీజేపీ జోక్యం పెరిగిందన్నారు. వాటి స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates