బీజేపీ వాకౌట్ : బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి

kuamaraకర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు. బీజేపీ ముందుగానే సభ నుంచి వాకౌట్ చేయటంతో.. కాంగ్రెస్- జేడీఎస్ విజయం లాంఛనం అయ్యింది.  మొత్తం సభ్యుల సంఖ్య 221 కాగా.. బలపరీక్షకు కావాల్సిన సంఖ్య 111. మొత్తం 117 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి గెలుపొందింది.

అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టారు. అయితే.. బల పరీక్షలో పాల్గొనకముందే బీజేపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఓటింగ్ లేకుండానే బల పరీక్ష ముగియడంతో.. విశ్వాస పరీక్షలో కుమార స్వామి గెలిచినట్లు ప్రకటించారు స్పీకర్ రమేష్ కుమార్. ఈ సందర్భంగా కాంగ్రెస్- జేడీఎస్ నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. వాకౌట్ చేస్తూ బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. అనైతిక పొత్తు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీని సోమవారంలోపు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

Posted in Uncategorized

Latest Updates