బీజేపీ సీఎంలకు రైతులపై ప్రేమ లేదు : రాహుల్ గాంధీ

RAHULమోడీతోపాటు.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు రైతులపై ప్రేమ లేదని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బహిరంగసభల్లో రైతుల గురించి ఉపన్యాసాలిచ్చే బీజేపీ నేతలు.. ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆరు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. కేంద్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు రాహుల్. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ లో రైతులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అనంతరం గత ఏడాది రైతుల ఆందోళనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు రాహుల్ గాంధీ.

Posted in Uncategorized

Latest Updates