బీజేపీ సీనియర్ ఎంపీ కన్నుమూత

బీజేపీ సీనియర్ నాయకుడు, బిహార్‌ లోని బెగుసరయ్‌ ఎంపీ బోలా సింగ్‌(80) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రాం మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. బోలా సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

1939లో జన్మించిన బోలా.. పట్నా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1967లో సీపీఐ మద్దతుతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత సీపీఐ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన కొంతకాలం తరువాత పార్టీతో విభేదించి..  ఆర్జేడీ 1990లో అధికారంలోకి రావడంతో లాలూతో చేతులు కలిపారు. ఆ తరువాత 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెగుసరయ్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు. ఎనిమిది సార్లు శాసన సభ్యుడిగా, రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు.

Posted in Uncategorized

Latest Updates