బీట్‌రూట్‌తో రక్తహీనత దూరం

సహజంగా లభించే ఆహారంలో బీట్‌రూట్‌ ఒకటి. దీంట్లో పోషకాలు చాలా ఉంటాయి. శాకాహార దుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేకస్థానం. దీంట్లో నైట్రేట్‌ నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌  ఆక్సైడ్ లుగా మారి రక్త సరఫరాను పెంచుతాయి. ఫలితంగా రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. విటమిన్‌-బి కూడా  బీట్ రూట్ లో ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం, గోళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. పెదవులు పొడి బారకుండా చూస్తుంది. డైట్‌ పాటించే వాళ్లు బీట్‌రూట్‌ను తీపి బదులుగా తీసుకోవడం మంచిది.

దీంట్లోని కార్బోహైడ్రేట్స్ మంచి శక్తినిస్తాయి. మహిళలకు అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ దీంట్లో పుష్కలంగా ఉంది. ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్స్‌‌ని మందుల రూపంలో తీసుకోవడం కన్నా ఇలా సహజంగా తీసుకోవటం చాలా బెటర్. పిల్లల మెదడును చురుకుగా ఉంచడంతో పాటు వాళ్లకు తక్షణ శక్తిని ఇవ్వడానికి బీట్‌రూట్‌ బెటర్‌. దీంట్లోని విటమిన్‌ ఏ, బీ, బీటైన్‌, క్యాల్షియం, మినరల్స్‌‌, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు బీట్‌రూట్‌ రసం తాగితే తొందరగా కోలుకుంటారు.

Posted in Uncategorized

Latest Updates