బీదర్ లో….తెలంగాణ వ్యక్తులపై దాడిని ఖండిస్తున్నా : పరమేశ్వర

చట్టాన్ని ఎవరు చేతులకు తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర. బీదర్ లో తెలంగాణకు చెందిన వారిపై దాడి చేయటాన్ని ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల ఆధారంగా దాడి చేసిన 30 మందిని అరెస్టు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. వారిపై కఠిన చర్యలకు డీజీపీని ఆదేశించామన్నారు. బీదర్ లో స్థానికుల దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించి వీరిపై దాడికి పాల్పడ్డారు బీదర్ వాసులు.

Posted in Uncategorized

Latest Updates