బీబీనగర్ లో ఎయిమ్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బీబీనగర్‌లో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న(సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భేటీ అయిన మంత్రివర్గం ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన(PMSSY) పథకంలో భాగంగా ఎయిమ్స్ కు ఆమోదం తెలిపారు. బీబీన గర్ ఎయిమ్స్ తోపాటు తమిళనాడులోని మధురైలోనూ మరో ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్ కు రూ.1,028 కోట్లు ఖర్చు చేయనున్నారు.

వచ్చే ఏడాది నుంచే ఎంబీబీఎస్ కోర్సు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఇటీవలే అడ్మిషన్ల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ జారీ చేసిన నోటిఫికేషన్లలో బీబీనగర్‌ కాలేజీ పేరూ ఉంది. వచ్చే ఏడాది మే నాటికి అడ్మిషన్లు పూర్తి కానుండగా, ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 14 ఎయిమ్స్ కాలేజీ ల్లో మొత్తం 807 సీట్లను భర్తీ చేయనున్నారు.

15 నుంచి 20 స్పెషాలిటీ విభాగాలు

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎయిమ్స్ కోసం టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారు. విభజన చట్టంలో భాగంగా ఎయిమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం ఆలస్యం చేసింది. దీంతో పార్లమెంట్ లో రాష్ట్ర ఎంపీలు పలుమార్లు దీనిపై ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కూడా ఎయిమ్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా బీబీనగర్‌లో ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని గతేడాది ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్ లో ప్రకటించారు. ఇప్పటికే బీబీనగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ కోసం 200 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బీబీనగర్ నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చారు. దీనికింద మెడికల్ కాలేజీతో పాటు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా రానుంది. 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలుంటాయి. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తెలంగాణకు వంద ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అదనంగా రానున్నాయి. సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 750 పడకలుంటాయి. రోజూ 1,500 ఓపీ, వెయ్యి మంది ఇన్ పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందనుంది. నాలుగేళ్లలో ఎయిమ్స్ ను పూర్తి స్థాయిలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎయిమ్స్ పూర్తైతే 3 వేల మందికి ఉపాధి లభించనుంది.

హెల్త్ హబ్‌గా బీబీనగర్

ఎయిమ్స్ ప్రారంభం అయ్యాక బీబీనగర్‌ ప్రాంతాన్ని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు వెయ్యి ఎకరాలు సేకరించాలని సీఎం కేసీఆర్ అప్ప ట్లోనే ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక స్మార్ట్ హెల్త్ సిటీని నిర్మించాలని సీఎం భావిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates