బీభత్సంగా శ్రీనగర్ : CRPF వాహనం కింద పడి ముగ్గురి మృతి

rinagarజమ్మూ-కశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడాయి. రాజధాని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్  వాహనాన్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే సమయంలో వారిని తొక్కించుకుంటూ CRPF జీపు వెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

రంజాన్ నెల కావడంతో నౌహట్టా శుక్రవారం పెద్ద సంఖ్యలో స్ధానికులు రోడ్లపై గుమిగూడారు. ఆసమయంలో అటుగా వెళ్తున్న ఒక సీఆర్పీఎఫ్ జీపు అక్కడికి రావడంతో ఆగ్రహానికి గురైన స్ధానికులు జీపుకి అడ్డంగా వెళ్లారు. అయితే జీపుకి అడ్డుపడటంతో జీపు వేగాన్ని పెంచిన డ్రైవర్ ఆందోళనకారులని తొక్కించుకుంటూ వెళ్లాడు. జీపు కింద నలిగిపోయి ఇద్దరు  ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేయగా, డ్రైవర్‌ చాకచక్యంగా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు. మరో వైపు మరికొన్ని రోజుల్లో అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానున్న సమయంలో కశ్మీర్ లో ఉదక్తలు నెలకొన్నాయి.

Posted in Uncategorized

Latest Updates