బీభత్సం సృష్టించింది : ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి

Bear-attackఏపీ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. గ్రామస్ధులపై దాడి చెయ్యడంతో నిర్మల అనే మహిళ చనిపోయింది. గాయపడిన వారిని స్ధానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆగ్రహించిన గ్రామస్తులు ఎలుగు బంటిని కొట్టి చంపారు. ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates