బీభత్సం సృష్టించిన తిత్లీ

ఏపి: పెనుతుఫానుగా మారిన ‘ తిత్లీ ’ బీభత్సం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో ఇవాళ(అక్టోబర్.11) తుఫాన్ తీరం దాటింది.  తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విరుచుకుపడ్డాయి. తుఫాన్ ధాటికి వంగర మండలంలోని ఓనిఅగ్రహారంలో ఇద్దరు మృతి చెందారు.

తుఫాన్ ప్రభావంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హైవే పై చెట్లు విరిగిపడటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందు జాగ్రత్తగా జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు సురక్ష‌ిత ప్రాంతాలకు తరలించారు.  తిత్లీ తుఫాన్ పై కేంద్రం అలర్ట్ అయ్యింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోం మినిస్ర్టీ తెలుసుకుంటోంది. తిత్లీ ప్రభావం ఉన్న ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ర్టాల అధికారులు అలర్ట్  గా ఉండాలని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates