బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన

62bc94d6-269c-4226-9c87-a16b60c88927హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచికొట్టింది. మంగళవారం (ఏప్రిల్-3) నాగారం, కీసర, ఘట్కేసర్ మండలాల్లో 3గంటల తరువాత భారీ గాలులు, రాళ్లవర్షం బీభత్సం సృష్టించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వెహికల్ నడిచే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చిన్నపాటి రాయిసైజు ఉన్న వడగళ్లతో జనం కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

వర్షంతో చాలాచోట్ల పంటనష్టం కూడా జరిగింది. మామిడి, మొక్కజొన్న, వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇక సిటీలోని హబ్సీగూడ, తార్నాక, ఓయూ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. రెండ్రోజులుగా సిటీ శివారు ప్రాంతాల్లో సాయంత్రం అవ్వగానే ఈదురుగాలు, వడగళ్ల వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండలు.. సాయంత్రం వానలతో డిఫరెంట్ వెదర్ ను సీటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates