బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

నెల్లూరు జిల్లా : నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ దగ్గర్లోని లారీ స్టాండ్స్ దగ్గర ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా చంపేశారు దుండగులు. గుర్తు తెలియని వ్యక్తులు బీర్ బాటిళ్లతో దాడి చేసి అతడిని హత్యచేశారు. చనిపోయిన వ్యక్తిని పడుగుపాడుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శిరీష్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉంటాయని నెల్లూరు టౌన్ డీఎస్పీ మురళి కృష్ణ అన్నారు. మృతుడు శిరీష్ తల్లి ప్రభుత్వ ఉద్యోగి. కొద్దిరోజులుగా శిరీష్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. వ్యాపారంలో లావాదేవీలే హత్యకు కారణమైనట్టు తెలుస్తోంది. బలమైన కారణం ఉండటం వల్లే.. బీర్ బాటిళ్లతో దాడి చేసి కిరాతకంగా చంపి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నిందుతుల కొసం పోలీసులు వెతుకుతున్నారు. రెండు నెలల్లో నెల్లూరులో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది రెండోసారి.

Posted in Uncategorized

Latest Updates