బీ అలర్ట్.. చెక్ ఇట్ : వాట్సాప్ నకిలీ వార్తలను ఇలా గుర్తించొచ్చు

ఫేక్ మెసేజ్ లను అరికట్టటం, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన క్రమంలో.. కొత్తగా ఫీచర్‌ తెచ్చింది వాట్సాప్. మెసేజ్‌ ను స్వయంగా పంపిన వారే రాశారా.. లేక ఎవరో పంపిన దానిని ఫార్వర్డ్‌ చేశారా అని తెలుసుకోవచ్చు. వాట్సాప్‌ యాప్‌ లేటెస్ట్ అప్‌ డేట్‌ లో ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్లు ప్రకటించింది వాట్సాప్. వినియోగదారులు ఒక మెసేజ్‌ ను ఫార్వర్డ్‌ చేసే ముందు అది ఎంతవరకు నిజమో సరిచూసుకోవాలని కోరింది.

ఫేక్ సమాచారం స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు వినియోగదారులకు అవేర్ నెస్ కల్పించేం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా  ప్రారంభించింది. తప్పుడు మెసేజ్ లు వ్యాప్తి చెందడం వల్ల దేశంలో చాలా చోట్ల దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం.. పరువు నష్టం లాంటి కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది వాట్సాప్. ఫేక్ సందేశాలను తెలుసుకోవడానికి పలు సూచనలు చేసింది వాట్సాప్.

ఫేక్ వార్తలను గుర్తించటం ఇలా :

… వచ్చిన ప్రతి మెసేజ్ ని నమ్మేయొద్దు. ఉదాహరణకు.. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఓ నారింజ చెట్టుకు మామిడి కాయలు కాస్తున్నాయంటూ మెసేజ్ వస్తే.. దాన్ని నమ్మే ముందు పరిశీలించాలి.
… కోపం తెప్పించే  మెసేజ్ లపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రిప్లైకి ముందుగా.. ఆ వార్తల్లోని రియాలిటీ కన్ఫమ్ చేసుకోవాలి.
… వైరల్‌ అయ్యేందుకు క్రియేట్ చేసిన మెసేజ్, పుకార్లు.. వినియోగదారుల సానుభూతి పొందే తరహాలో రూపుదిద్దుకుంటాయి. వాటిలో స్మైలీలు ఎక్కువగా ఉండొచ్చు. 1-2 ఫొటోలూ ఉండొచ్చు. అలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలి.
… మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు వాట్సప్‌ లో తరచుగా వైరల్‌ అవుతుంటాయి. సో.. ఫొటోలను జాగ్రత్తగా పరిశీలించాలి.
… ఫొటోల తరహాలోనే లింక్‌ లనూ కొందరు మార్చేస్తుంటారు. అఫీషియల్ వెబ్‌ సైట్‌ కు చెందిన వాటిగా భ్రమ కల్పిస్తారు. వీటితో జాగ్రత్తగా ఉండాలి.
… పుకార్లు వ్యాప్తిని అడ్డుకోవడంలో అన్నింటికంటే కీలకమైన అంశమిది. వాట్సప్‌ లోనే సమాచారాన్నంతటినీ తెలుసుకోవద్దు. వచ్చిన మెసేజెస్ లో నిజానిజాలను నిర్ధారించుకునేందుకు వార్తాపత్రికలు చదవాలి. లేదంటే టీవీల ద్వారా వార్తలు తెలుసుకోవాలి.
… ఏదైనా సమాచారం, మెసేజ్ నమ్మదగినట్లు లేకపోతే వాటిని ఇతరులకు పంపించొద్దు.
… తరచుగా పుకార్లు, ఫేక్ ఇన్మర్మేషన్ పంపిస్తున్నవారిని బ్లాక్‌ చేయండి.
… ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేలా ఉన్న సందేశాలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. ఫుకార్లను ఆ తరహాలోనే క్రియేట్ చేస్తారు.  వైరల్‌ మెసేజ్ లపై అప్రమత్తత అవసరం.

Posted in Uncategorized

Latest Updates