బీ అలర్ట్ : పెట్రోల్, డీజిల్ పై సమ్మె ఎఫెక్ట్

దేశవ్యాప్తంగా సాగుతున్న లారీల సమ్మె ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పైనా పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ట్యాంకర్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 4వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. కొన్ని ట్యాంకర్లు మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. జూలై 25వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఆయిల్ ట్యాంకర్లను కూడా నిలిపివేస్తామని ట్యాంకర్ల ఆపరేటర్లు హెచ్చరించారు. ఆయిల్ ట్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో బంద్ లో పాల్గొంటే.. మరో రెండు రోజుల్లో పెట్రోల్ బంకులు కూడా మూతపడే పరిస్థితి రానుంది. దీంతో అలర్ట్ అయిన వాహనదారులు ముందస్తుగానే ట్యాంకులు ఫుల్ చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కూడా క్రమంగా పెరుగుతుంది.

లారీల సమ్మెకు ఇండియన్, భారత్, హెచ్ పీ పెట్రోలియం కార్పొరేషన్ల లారీ, ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసగౌడ్. దేశవ్యాప్తంగా సమ్మెలో 90లక్షల లారీలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. లారీలపై ఆధారపడి 10 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ప్రకటించారు. కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని చర్లపల్లి, సూర్యాపేట, రామగుండం, ఘట్ కేసర్, వరంగల్ డిపోల్లోని ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్లు కూడా సమ్మెకి మద్దతు ప్రకటించాయి.

లారీ ఓనర్స్ డిమాండ్స్  ఇవే :

… డీజిల్ ధరలను రోజువారీ కాకుండా మూడు నెలలకు ఒకసారి సవరించాలి.

… డీజిల్ రేట్లను GST పరిధిలోకి తీసుకురావాలి.

… టోల్ ట్యాక్స్ లు తగ్గించాలి.

… థర్డ్ పార్టీ ఇన్యూరెన్స్ ప్రీమియం తగ్గించాలి.

… TDS వసూలు రద్దు చేయాలి.

… ఏపీ – తెలంగాణ మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలి.

… ఓవర్ లోడింగ్, యాక్సిడెంట్ల విషయంలో డ్రైవర్ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలి.

… లారీ డ్రైవర్లకు కనీస విద్యార్హత 10వ తరగతి నిబంధన ఎత్తివేయాలి.

Posted in Uncategorized

Latest Updates