బీ అలర్ట్ : మండే ఎండలపై సీఎం ఆఫీస్ సూచనలు

kcr-summer

ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలోని రామగుండం, ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో అత్యధిక టెంపరేచర్ నమోదు అవుతుంది. హైదరాబాద్ సిటీలోనూ 41 డిగ్రీలకు చేరింది. ఈ క్రమంలోనే ఎండల నుంచి కాపాడుకోవటానికి అవసరమైన సూచనలు, సలహాలను విడుదల చేసింది సీఎం కేసీఆర్ ఆఫీస్.

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడని పనులు :

… సూర్యకిరణాలకు, వేడి గాలికి ఎక్కువ గురి కాకూడదు

… గొడుగు లేకుండా ఎండలోకి రావొద్దు

… నలుపు, ముదురు రంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు

… వడదెబ్బకు గురైన వారిని వేడినీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు

… దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

… ఎండ ఎక్కువగా రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి.

… దూదితో నేయబడిన తెలుపు, లేత రంగు గల పలుచటి వస్త్రాలను ధరించాలి.

… నెత్తిపై టోపీ లేదా కర్చీఫ్ పెట్టుకోవాలి.

… ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి.

… ఉప్పు కలిపిన మజ్జిగ / గ్లూకోజ్ కలిపిన నీరు / ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము తాగాలి.

… వడదెబ్బకు గురైన వారిని చల్లటి ప్రదేశాలకు తరలించాలి.

… వడ్డదెబ్బకి గురైన వారిని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు ఈ విధంగా శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాన్ కింద వడదెబ్బ వ్యక్తిని ఉంచాలి.

… వడ్డదెబ్బకి గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు లేనిచో శీతల వాతావరణంలో దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

 

Posted in Uncategorized

Latest Updates