బీ అలర్ట్ : రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయ్

RAINSరెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రాత్రి(శుక్రవారం) నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అత్యధికంగా వర్షాపాతం నమోదైంది. జిగిత్యాల జిల్లా మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది.

ఆదిలాబాద్ జిల్లాలోనూ వాగులు పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో… నీటి 693 అడుగులకు చేరింది. దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోకి 3774 క్యూసెక్కులు, భీంఫూర్ మండలం మత్తడి ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెద్దవాగు జలకళతో ఉట్టిపడేతున్నది. పిట్లం మం డలం ప్రధాన రహదారిపై ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేల కూలాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో ప్రభుత్వ పాఠశాలలోని వంట గది కూలిపోయింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్నది.

జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వానలు పడ్డాయి. వికారాబాద్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సూర్యాపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పనులు నిలిచిపోగా, 5వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60వేల క్యూ బిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపు పనులకు ఆటంకం కలిగింది. మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీలోనూ బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది. కోస్తాంద్రకు 24గంటల్లో భారీ వర్ష సూచన ఉందని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates