బీ అలర్ట్.. : హైదరాబాద్ రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జాం

హైద్రాబాద్ లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ కు వెళ్లే టైం కావడంతో.. ట్రాఫిక్ రద్దీ బాగా ఉంది. వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలవడంతో.. ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. రోడ్లపై గుంతలతో కూడా జనానికి తిప్పలు తప్పడం లేదు. GHMC సిబ్బంది అలర్ట్ గా ఉన్నప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు మొదలు కాలేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది.

బేగంబజార్, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమయత్ నగర్, తార్నాక, నాచారం, మల్లాపూర్, రాజేంద్రనగర్, మోహిదీపట్నం, బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురంలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. ఇప్పటివరకు ఆగకుండా వాన పడుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఓవైపు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్.. ఇంకోవైపు ఎంప్లాయిస్ ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు.

చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలకు తోడు.. ఉత్తర ఒడిశా తీరం మీద ఉపరిత ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా…దక్షిణ తెలంగాణలో వాన ముసురు కొనసాగుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates