బీ అలర్ట్ : 200 మందికి స్వైన్ ఫ్లూ

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 200 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 190 మంది ఫ్లూ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు.

నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)కు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే శాంపిల్స్‌‌‌‌లో రోజుకు సగటున పదికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని IPM డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ చెప్పారు.

చలి ప్రభావం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ నోడల్ కేంద్రాలతో పోల్చితే ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌లో స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు అధికంగా రికార్డవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 190 మంది, ప్రభుత్వాసు పత్రుల్లో 10 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందడం వల్ల, వ్యాధి నిర్ధా రణ అయ్యేదాకా అనుమానితుల్ని సాధారణ వార్డులోనే ఉంచి చికిత్స చేయడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

ఉస్మానియా ఆసుపత్రిలో 3 నెలల్లో 31 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది చనిపోయారు. ప్రస్తుతం ఉస్మానియాలో ముగ్గురు, గాంధీలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates