బీ అలర్ట్ : 5 రోజులు బ్యాంకులకు సెలవులు

బ్యాంకుల్లో మీకేమైనా పని ఉందా…డబ్బులు వేయడం, తీయడం చేయనున్నారా. అయితే ఇవాళే పని పూర్తి చేసుకోండి. లేదంటే కస్టమర్లకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే రేపటి (శుక్రవారం) నుంచి బ్యాంకింగ్ సేవలు 5 రోజుల పాటు నిలిచిపోనున్నాయి.

ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌(AIBOC) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు.25వ తేదీ క్రిస్మస్‌ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ సమ్మెకు దిగుతోంది. మధ్యలో 24వ తేదీ సోమవారం ఒకరోజుబ్యాంక్ తెరిచి ఉంటుంది. వేతన సవరణ, పలు డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్లు 21, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండురోజుల్లో ఎన్ని బ్యాంకులు పనిచేస్తాయన్నది కచ్చితంగా తెలియదు. సో… బ్యాంకులకు వరుస సెలవులతో ఇబ్బందులు పడకుండా ఖాతాదారులు ముందుగానే లావాదేవీలు పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.

మరోవైపు బ్యాంకుల వరుస సెలవులతో నగదు కొరత ఏర్పడకుండా ఏటీఎంలలో నగదును నింపాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates