బీ కేర్ ఫుల్ బీజేపీ….1987 పాలిటిక్స్ ఇప్పుడు ట్రై చేయకండి : మెహబూబా

పీడీపీని చీల్చితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. 1987 తరహా రాజకీయాలు ఇప్పుడు చేయాలని బీజేపీ ట్రై చేస్తే… అప్పుడు సలావుద్దీన్, యాసిన్ మాలిక్ వచ్చినట్టుగానే ఇప్పుడు మరింత మంది పుట్టుకువస్తారన్నారు. పీడీపీలో వర్గాలను ప్రోత్సహిస్తూ, చీల్చాలని చూస్తే భారత రాజ్యాంగంపై కశ్మీరీలకు నమ్మకం పోతుందన్నారు ముఫ్తీ. ప్రతి ఇంట్లో సమస్యలున్నట్టుగానే.. పార్టీలోనే కొన్ని సార్లు ఇబ్బందులుంటాయన్నారు ముఫ్తీ. అవి కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుంటాయన్నారు. పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించిన తర్వాత.. ఆ పార్టీపై ముఫ్తీ ఇంత తీవ్ర స్థాయిలో కామెంట్లు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
జమ్మూకశ్మీర్ లో 87 అసెంబ్లీ స్థానాలున్నాయి. పీడీపీకి 28, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, కాంగ్రెస్ కు 12, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కు రెండు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో… ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలవుతోంది. పీడీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి బీజేపీకి మద్దతిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపైనే స్పందించారు ముఫ్తీ. రీసెంట్ గా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ముఫ్తీ. ఈ భేటీకి 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates