బుకర్ ప్రైజ్ విన్నర్ అన్నా బర్న్స్

లండన్: ప్రెస్టీజియస్  మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 2018 సంవత్సరానికి  ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్ సొంతం చేసుకున్నారు. ఆమె రాసిన మిల్క్ మ్యాన్ నవలకు ఈ అవార్డ్ దక్కింది. 20వ శతాబ్దం చివర్లో నార్త్ ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరత కాలంలో ఓ యువతి, వివాహితుడితో ఏర్పర్చుకున్న సంబంధం  కాన్సెప్ట్ తో ఈ నవల సాగుతుంది.

ఈ నవలలో ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు అన్నా రాశారని కమిటీ ప్రశంసలు కురిపించింది. మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన ఫస్ట్ నార్త్  ఐరిష్‌ మహిళగా అన్నా రికార్డ్ క్రియేట్ చేశారు. లండన్‌లో మంగళవారం(అక్టోబర్.16)  జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ అందచేశారు.

 

 

లండన్‌లో మంగళవారం(అక్టోబర్ 16) రాత్రి గ్రాంగ్

 

 

 

జరిగిన కార్యక్రమంలో అన్నా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాజకీయ సంక్షుభిత సమయంలో యవ్వనపు తొలినాళ్లలో ఉన్న యువతికీ, పెండ్లయిన మధ్యవయస్కుడికీ మధ్య ప్రణయబంధాన్ని కథావస్తువుగా ఈ నవల సాగింది. ఉత్తర ఐర్లాండ్‌లోని ఒకానొక నగరంలో క్యాథలిక్కులు, ప్రొటెస్టంట్ల మధ్య హింస ప్రజ్వరిల్లిన సమయంలో జరిగిన పరిణామాలను ఆమె తన నవలలో చిత్రీకరించారు. యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న అమ్మాయి ఓ యుద్ధక్షేత్రం లాంటి నగరంలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నదనే విషయాన్ని అన్నాబర్న్స్ అద్భుతంగా పుస్తకరూపంలోకి మలిచారు.

ఇలాంటి రచనను మునుపెన్నడూ మేము చదువలేదని ఎంపిక కమిటీ చైర్మన్ క్వామె ఆంథోనీ అప్పియా కితాబిచ్చారు. 56 ఏండ్ల అన్నా ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో జన్మించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ ససెక్స్‌లో నివసిస్తున్నారు. 2001లో తన తొలినవల నో బ్యాన్స్‌ను రాసిన అన్నాకు మిల్క్‌మ్యాన్ మూడవ రచన. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న 17వ మహిళగా ఆమె నిలిచారు. ఆంగ్ల సాహిత్యంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా బుకర్‌ప్రైజ్‌ను భావిస్తారు. ఈ అవార్డు కింద 52,500 పౌండ్ల (రూ.50.85లక్షల) నగదును విజేతకు అందజేస్తారు. తనకు అవార్డు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నా పేర్కొన్నారు.

బుకర్ ప్రైజ్ విన్నర్

Posted in Uncategorized

Latest Updates