బుఖారీ హత్య నిందితుల్లో పాకిస్ధాన్ ఉగ్రవాది

PAKదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైజింగ్‌ కాశ్మీర్‌ పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు షుజాత్‌ బుఖారీని హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. బుఖారీని హత్య చేసిన ముగ్గురు నిందితులను సీసీ పుటేజి ఆధారంగా గుర్తించినట్లు బుధవారం(జూన్-27) పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు పాకిస్ధాన్ కు చెందిన నవీద్ జాట్ గా పోలీసులు గుర్తించారు. నవీద్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధ సభ్యుడిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. మిగతా ఇద్దరు స్ధానిక మిలిటెంట్లు అని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరిలో నవీద్ జాట్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. జూన్‌ 14న ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు కారులో వెళ్తున్న బుఖారీపై బైక్‌ పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుఖారీ తో పాటుగా ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

Posted in Uncategorized

Latest Updates