బురారీ డెత్ మిస్టరీలో షాకింగ్ : నాన్న బతికిస్తాడు అంటూ అందర్నీ చంపేశాడు

BURదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ బురారీ డెత్ మిస్టరీలో కొత్తకొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఫస్ట్ నుంచి పోలీసులు అనుమానిస్తున్నట్టుగా ఇంట్లో లభించిన సూసైడ్ నోట్… చనిపోయిన కుటుంబసభ్యుల్లో ఒకడైన లలిత్ చుండవ (45) రాసినట్లుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులను.. లలిత్ ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో లభించిన లలిత్ రాతప్రతులు ఈ విషయాన్ని సృష్టం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు.

10 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రితో మాట్లాడుతున్నట్లు లలిత్ అందర్నీ నమ్మించేవాడు. ప్రపంచం నాశనమయ్యే రోజు వస్తోందనీ, తమ కుటుంబాన్ని మాత్రం తన తండ్రి రక్షిస్తాడని లలిత్ రాసిన ఓ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి భ్రమలు, ఆత్మల మీద నమ్మకమే 11 మంది కుటుంబ సభ్యులు  ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రేరేపించాయని పోలీసులు తేల్చారు. ఆదివారం(జులై-1) ఉదయం ఢిల్లీలోని బురారీ ఏరియాలోని నారాయణ్ దేవి(77), ఆమె పిల్లలు, మనుమలు తమ ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే

 

Posted in Uncategorized

Latest Updates