బులంద్ షహర్ ఘటనలో ఆర్మీ జవాన్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్: సంచలనం సృష్టించిన బులంద్ షహర్ ఘటనలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ కుమార్ పై కాల్పులు జరిపాడని అనుమానిస్తున్న ఆర్మీ జవాన్ జితేంద్ర మాలిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(శనివారం) అర్ధరాత్రి ఆర్మీ అధికారులు.. జితేంద్ర మాలిక్ ను తమకు అప్పగించడంతో అతడిని అరెస్ట్ చేశామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సీనియర్ ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు.

గోవధ జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనలు జరుగుతున్న సమయంలో.. వాటిని కంట్రోల్ చేసేందుకు వెళ్లిన ఇన్ స్పెక్టర్ ను కొందరు వ్యక్తులు వెంబడించి దాడి చేసినట్లు వీడియోల్లో వెల్లడైంది. ఈ వీడియోలో జవాను జితేంద్ర మాలిక్  అక్కడున్న వారిని.. సుబోధ్ కుమార్ పై దాడి చేయాల్సిందిగా రెచ్చగొడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates