బులంద్ షహర్ ఘటన ఓ యాక్సిడెంట్.. మూక దాడి కాదు : సీఎం యోగీ

బులంద్ షహర్ ఘర్షణలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ కుమార్ , పౌరుడు సుమిత్ కుమార్ చనిపోయిన ఉదంతం.. అనుకోకుండా జరిగిన ఓ దుర్ఘటన , యాక్సిడెంట్ అని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. మూకదాడులకు రాష్ట్రంలో ఎక్కడా చోటు లేదన్నారు. నిందితులు ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు.

ఇద్దరు పోలీసు అధికారుల బదిలీ

బులంద్ షహర్ హింసాత్మక ఘటనపై ఇంటలిజెన్స్ ఏడీజీ ఎస్బీ శిరద్కార్ తన నివేదికను సీఎం యోగీకి అప్పగించారు. ఈ రిపోర్టు ఆధారంగా.. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. బులంద్ షహర్ SSP కృష్ణ బహదూర్ సింగ్ ను లక్నో డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. సియానా సర్కిల్ ఆఫీసర్ సత్య ప్రకాశ్ శర్మను… మొరాదాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు ఎటాచ్ చేశారు. సితార్ పూర్ ఎస్పీ ప్రభాకర్ చౌదరిని… బులంద్ షహర్ SSPగా నియమించారు.

ఓ సైనికుడిపై ఎఫ్ఐఆర్

డిసెంబర్ 3న జరిగిన బులంద్ షహర్ హింసాత్మక ఘటనకు సంబంధించి .. ఎఫ్ఐఆర్ లో ఓ సైనికుడిని నిందితుడిగా అరెస్ట్ చేశారు సియానా స్టేషన్ పోలీసులు. కశ్మీర్ .. సోపోర్ లోని 22 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సోల్జర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తన సోదరుడిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని.. సీఎంను కలుస్తానని సైనికుడి కుటుంబసభ్యుడు ధర్మేంద్ర మాలిక్ చెప్పాడు. కేసును డీల్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్.. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ లో 27మంది పేర్లను నమోదు చేశారు పోలీసులు. అరవై మంది వరకు ఈ ఘటనతో సంబంధం ఉందని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates