బులంద్ షహర్ బాధిత పోలీస్ కుటుంబానికి సీఎం యోగీ అభయం

యూపీ : బులంద్ షహర్ గొడవలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ సుబోధ్ సింగ్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ఇవాళ గురువారం డిసెంబర్ ఆరున లక్నోలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసింది సుబోధ్ ఫ్యామిలీ.  ఇన్ స్పెక్టర్ భార్య, ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. సీఎం యోగీ తమకు.. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఇన్ స్పెక్టర్ కుమారుడు శ్రేయ్ ప్రతాప్ సింగ్ అన్నారు.

బాధిత కుటుంబానికి ఎడ్యుకేషన్ తో పాటు.. ఇతర అప్పులేమైనా ఉంటే ప్రభుత్వమే వాటిని చెల్లిస్తుందని బీజేపీ మంత్రి అతుల్ గార్గ్ చెప్పారు. యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తున్నామన్నారు. ఓ రహదారికి సుబోధ్ సింగ్ పేరు పెడతామని చెప్పారు. ఓ కాలేజీకి కూడా సుబోధ్ సింగ్ పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు.

సోమవారం బులంద్ షహర్ గ్రామంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరిలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ సింగ్ ఒకరు. గో వధకు వ్యతిరేకంగా అక్కడ నిరసన జరుగుతోంది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ రాళ్లదాడుల వరకు వెళ్లింది. ఈ దాడిలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ సింగ్, ఓ నిరసనకారుడు చనిపోయారు.

 

Posted in Uncategorized

Latest Updates