బుల్లితెర జీవితం వెనక : సీరియల్స్ నటుడు.. ఘరానా దొంగ

thief-serial-actressఅతడి పేరు నాగరాజు అలియాస్ నరేందర్ అలియాస్ నరేంద్ర. వయస్సు 23 ఏళ్లు. చూడ్డానికి చక్కగా ఉంటాడు. బతకటం కోసం కార్పెంటరీ పనులు చేస్తూ ఉంటాడు. వెండితెరపై నటించాలనే కోరిక ఎక్కువ. ఈ క్రమంలోనే తన సొంత గ్రామం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. జూబ్లీహిల్స్ ఇందిరానగర్ వచ్చాడు. ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలనే లక్ష్యంతో ముందుగా బుల్లితెరపై కాన్సంట్రేషన్ చేశాడు. అందులో భాగంగా ఓ ప్రైవేట్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లో ప్రసారం అయ్యే ఓ టీవీ సీరియల్ లో చిన్న చిన్న పాత్రలకు అవకాశం దక్కించుకున్నాడు. ఆ పాత్రలు చేయటం వచ్చేది కూడా అంతంత మాత్రమే ఆదాయం. దీనికితోడు బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విలాసాలకు అలవాటు పడ్డాడు. మందు కొట్టటం, పేకాటకి బానిస అయ్యాడు. వచ్చే ఆదాయం సరిపోకపోగా అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే దొంగతనాలకి దిగాడు.

అప్పటికే ఇళ్లల్లో కార్పెంటరీ వర్క్, పెయింటింగ్ పనులు చేసిన అనుభవం ఉండటంతో.. ఇళ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. సీరియల్స్ షూటింగ్ లేనప్పుడు ఆయా కాలనీల్లో రెక్కీ నిర్వహించేవాడు. ఆ తర్వాత దొంగతనాలు చేసేవాడు. ఇందుకు సరూర్ నగర్, చైతన్యపురి ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఇళ్ల తలుపులు పగలగొట్టటానికి స్క్రూడైవర్, కటింగ్ ప్లేర్ ఉపయోగించేవాడు. 2016 నుంచి ఇప్పటి వరకు 17 ఇళ్లను దోచుకున్నాడు. నరేందర్ పై ఇప్పటికే 16 కేసులు నమోదు అయ్యాయి. అన్ని దొంగతనాలు ఒకే తరహాలు ఉండటంతో నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా దొంగను పట్టుకోవటంలో ఎల్బీనగర్ డీసీపీ ఎంవీ రావ్, ఏసీపీ పృథ్వీధర్ రావు, చైతన్యపురి డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మహేష్ కృషి అభినందనీయం అన్నారు కమిషనర్ మహేష్ భగవత్.

Posted in Uncategorized

Latest Updates