బుల్లెట్ రైలు కంటే స్పీడ్

loop
దేశంలోనే మొదటి హైపవర్ లూప్ రవాణా వ్యవస్థ మహారాష్ట్రలో అందుబాటులో రానుంది. ఆదివారం(ఫిబ్రవరి-18) ముంబైలో నిర్వహించిన మ్యాగ్నటిక్ మహారాష్ట్ర గ్లోబల్ సదస్సులో వర్జిన్ హైపర్ లూప్ వన్ సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకుంది. పుణె నుంచి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు దీన్ని ఏర్పాటు చేయనుంది.  ఈ రెండు నగరాల మధ్య ఉన్న 161 కిలోమీటర్ల దూరాన్ని హైపర్ లూప్ తో కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రత్యేకంగా హైపర్ లూప్ టెక్నాలజీతో సొరంగాల రూపంలో రూపొందించిన రైలు మార్గం ద్వారా ఇది సాకారం కానున్నది.

ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా పూర్తి చేయడానికి మూడేళ్లు పడుతుంది. పూర్తిస్థాయిలో ప్రజలకు 2024 నాటికి అందుబాటులోకి వస్తుంది.

Posted in Uncategorized

Latest Updates