బెంగళూరుకు సీఎం కేసీఆర్

kcr-devegouda-kumaraswamiబెంగళూరుకు బయలుదేరారు సీఎం కేసీఆర్. కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం (మే-23) ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని అభినందించేందుకు మంగళవారం సాయంత్రం బెంగళూరుకు బయలుదేరారు కేసీఆర్. బుధవారం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నప్పటికీ.. అత్యవసర సమావేశాలు ఉండటంతో మంగళవారం (మే-22) బెంగళూరు వెళుతున్నారు సీఎం.

దేశంలో గుణాత్మక రాజకీయాలు తేవాలనే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీల నేతలను ఒక్కతాటిపైకి తేవడానికి ఏప్రిల్- 13న బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, జేడీఎస్ నేత కుమారస్వామిలతో కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో JDS కీలకమవుతుందని మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రకటించగా, ఫలితాల తర్వాత ఆయన అంచనాలే నిజమయ్యాయి. ప్రాంతీయ పార్టీలన్నీ మరింత బలపడటంతోపాటు ఏకతాటిపై రావాలని, సరికొత్త ఎజెండాతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ఎజెండాను ఖరారు చేయడానికి మరికొన్ని పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం (మే-22) సాయంత్రం బెంగళూరులో కేసీఆర్… కుమారస్వామిని అభినందించి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates