బెంగళూరులో కలకలం : సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ.. మావోలతో సంబంధాలు

MAVOIST TECHI LINKS ARRESTబెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఛత్తీస్ ఘడ్ పోలీసులు. ఇంటర్నేషనల్ మావోలతో సంబంధాలు ఏర్పరచుకున్న బెంగళూరుకు చెందిన అభయ్ (34) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం (జూన్-12) సాయంత్రం అరెస్ట్ చేశారు చత్తీస్ ఘడ్ పోలీసులు. 15 దేశాల్లోని మావోయిస్టులకు కీలక సమాచారం అందజేస్తున్నాడని.. అతడి దగ్గర ఉన్న ల్యాప్ టాప్స్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుడి పూర్తి వివరాలు.. అతడి ఫోటోను విడుదల చేయటానికి నిరాకరించారు పోలీసులు. రహస్యంగా విచారిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో టెకీ ఫోటోలు వైరల్ అవుతాయని.. దీని ద్వారా ఈ సమాచారం మావోయిస్టులకు చేరుతుందంటున్నారు. నిందితుడి నుంచి పూర్తి వివరాలను సేకరించి, దీని వెనక ఉన్న మావోయిస్టుల ఆధారాలను సేకరిస్తామంటున్నారు. ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లో ఉన్న లింక్స్ ను పరిశీలిస్తున్నామని.. తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉంది అని తెలిపారు రాయపూర్ పోలీసులు.

గతంలో ఒరిస్సాలోనూ ఓ టెకీ-మావోలతో లింక్స్ ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అప్పట్లో టెకీ ఫోటో, వివరాలు మీడియాకి చెప్పడంతో మావోలు అప్రమత్తం అయ్యారన్నారు. దీంతో తమకు ఎలాంటి ఆధారాలు లభించలేకపోయాయన్నారు. పూర్తి విచారణ తర్వాత నిందితుడిని మీడియాకు చూపిస్తామని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates