బెంగళూరులో ఘోర ప్రమాదం : కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

BNGబెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గురువారం (ఫిబ్రవరి-15) సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని బెంగళూరు నగర మేయర్ సందర్శించి పరిశీలించారు. 5 అంతస్తుల భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates