బెంగళూరులో భారీ వర్షం : కుమారస్వామి ప్రమాణస్వీకారం వేదిక మార్పు

vidhan-soudha-rain KARNATAKA - Copyబెంగళూరులో కుండపోత వర్షం పడుతోంది. గంట నుంచి ఆగకుండా పడుతున్న వర్షంతో బెంగళూరు నగరం తడిసి ముద్దయ్యింది. భారీ వానతోపాటు ఈదురుగాలులు ప్రజలను బెంబేలెత్తించాయి. సిటీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు కూలి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా వర్షం పడుతున్నా.. కొద్దిసేపటికే తగ్గిపోవటం, ఆ తర్వాత ఎండ రావటం కామన్ అయ్యింది. అయితే మే 23వ తేదీ బుధవారం మాత్రం కుండపోత వర్షంతో బెంగళూరు నగరాన్ని వణికించింది.

ఇవాళ కర్నాటక ప్రజలకు స్పెషల్ డే. ఎందుకంటే.. ముఖ్యమంత్రిగా జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అసెంబ్లీ (విదాన సౌధ) ఎదుట.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మరో గంటలో జరిగే కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సీతారాం ఏచూరీ ఇతర ప్రముఖులు కూడా బెంగళూరు చేరుకున్నారు.

భారీ వర్షం కారణంగా సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమం.. విదాన సౌధ లోపలికి మార్చారు. సమావేశ మందిరంలో నిరాడంబరంగా జరగనుంది. ప్రముఖులు ఎక్కువగా ఉండటంతో.. ప్రజలు ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదు.

Posted in Uncategorized

Latest Updates