బెంగళూరు టూర్ : సీఎం కేసీఆర్ వెంట ప్రకాష్ రాజ్

KCR-prakesh-rajఫెడరల్ ఫ్రంట్ టూర్ లో భాగంగా బెంగళూరు బయలుదేరి వెళ్లారు సీఎం కేసీఆర్. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. మధ్యాహ్న 2 గంటలకు దేవగౌడతో చర్చించనున్నారు. ఆయన వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం విశేషం. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని.. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల ఇది సాధ్యం కాదని.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ వల్లే సాధ్యం అని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ పార్టీల నేతలు భేటీ అవుతున్నారు. ఈరోజు జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవగౌడతో చర్చలు జరుపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates