బెంగళూరు టెస్ట్ : టీమిండియా 474 ఆలౌట్

INDబెంగళూరు వేదికగా ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శుక్రవారం (జూన్-15) రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ ..మరో 127 రన్స్ కు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. శుక్రవారం ఆటలో ఓవర్‌ నైట్‌ ఆటగాడు అశ్విన్‌(7) ఆదిలోనే పెవిలియన్‌ కు చేరగా, మరో ఓవర్‌ నైట్‌ ప్లేయర్ హార్దిక్‌ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.

ఈ క‍్రమంలోనే హార్దిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి రవీంద్ర జడేజా(20) ఔట్‌ కావడంతో 436 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్‌ 71 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.

చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(26 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇషాంత్‌ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్‌ కు ఉమేశ్‌ యాదవ్‌ 34 పరుగులు జత చేశాడు. అంతకుముందు మొదటిరోజు గురువారం (జూన్-14) ఆటలో శిఖర్‌ ధావన్‌107, మురళీ విజయ్‌ 105, KL రాహుల్‌(54)లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో యమీన్‌ అహ్మద్‌ జాయ్‌ మూడు వికెట్లతో రాణించగా, వఫాదార్‌, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Posted in Uncategorized

Latest Updates