బెంగళూరు టెస్ట్ : భారత్ బ్యాటింగ్

INDఅంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి గురువారం (జూన్-14) అరంగేట్రం చేయనుంది అఫ్గానిస్తాన్. ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఆ టీమ్ సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ చారిత్రక మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీమిండియా. కోహ్లి గైర్హాజ‌రీలో అజింక్యా ర‌హానే ఇండియాకి కెప్టెన్సీ వ‌హిస్తుండ‌గా, చాన్నాళ్ళ త‌ర్వాత దినేష్ కార్తీక్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. సుదీర్ఘ‌చరిత్ర ఉన్నఇండియాకు ఆఫ్ఘ‌నిస్తాన్ ఏ ర‌క‌మైన పోటీ ఇస్తుందా అని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్‌లో అలరించిన‌ ఆఫ్ఘాన్ టీం టెస్ట్ క్రికెట్‌లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. ఆఫ్ఘ‌నిస్థాన్‌ డైన‌మైట్ ర‌షీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో సంచ‌న‌లం సృష్టించి త‌మ‌కి మంచి విజ‌యం అందిస్తాడ‌ని ఆఫ్ఘ‌న్ టీం భావిస్తున్న‌ది.

జట్ల వివరాలు:
భార‌త్: శిఖ‌ర్ ధావన్‌, ముర‌ళీ విజ‌య్‌, చ‌తేశ్వ‌ర్ పుజారా, అజింక్యా ర‌హానే (కెప్టెన్‌), లోకేష్ రాహుల్‌, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), హార్ధిక్ పాండ్యా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్‌

ఆఫ్ఘ‌నిస్థాన్‌: మ‌హ‌మ్మ‌ద్ షెహ‌జాద్‌, జావెద్ అహ్మ‌ది, ర‌హ్మ‌త్ షా, అజ్గ‌ర్ స్టానిక్ జై (కెప్టెన్), అఫ్జ‌ర్‌ జ‌జై (వికెట్ కీప‌ర్‌), మ‌హ‌మ్మ‌ద్ న‌బీ, హ‌ష్మ‌తుల్లా షాహిది, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌, యామిన్ అహ్మ‌ద్ జై, వ‌ఫాదార్

Posted in Uncategorized

Latest Updates