బెంగళూరు టెస్ట్: మొదటి రోజు భారత్ స్కోరు 347/6

MURALబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్,ఆఫ్గాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది భారత్. ఆరంభంలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడుతుంటే.. అఫ్గాన్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. శిఖర్ ధావన్ 107, మురళీ విజయ్ 105, లోకేష్ రాహుల్ 54, పుజారా 35 పరుగులు చేసి ఔట్ కాగా… హార్ధిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్ లు క్రీజులో ఉన్నారు.

ఆఫ్గానిస్తాన్ బౌలర్లు  యామిన్ అహ్మద్ జై రెండు, వఫ్డార్, రషీద్ ఖాన్, ముజిబుర్ రహిమాన్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates