బెంగళూరు టెస్ట్ లో.. దూకుడుగా భారత్ : విజయ్ సెంచరీ

muraliబెంగళూరు వేదికగా గురువారం  ( జూన్-14) ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ చెలరేగి ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (107) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ సమయానికి వికెట్ నష్ట పోకుండా 158 పరుగులు చేసిన భారత్..ఆ తర్వాత 28.4 ఓవర్ లో 107ధావన్ ఔట్ అయ్యాడు. దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ప్లేయర్లలో ఆరో ఆటగాడిగా ధావన్ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ తో కలిసి ఆచితూచి ఆడుతున్న మురలీ విజయ్ సెంచరీ చేశాడు. 152 బాల్స్ లో 15 ఫోర్లు, ఒక్క సిక్స్ తో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ ల్లో సత్తా చాటిన ఆఫ్ఘన్ ..ఇండియాపై గెలవాలని తహతహలాడుతోంది. అయితే భారత్ మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే రీతిలో బ్యాటింగ్ చేస్తోంది. 51 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 280 పరుగులు చేసింది. రాహుల్(54), మురళీ విజయ్ (105) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోంటున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా కనిపిస్తోంది.

మురళీ విజయ్ కెరీర్ లో అతనికిది 12వ టెస్ట్ సెంచరీ.

 

 

Posted in Uncategorized

Latest Updates