బెంగాల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ రథయాత్రకు బ్రేకులు

 కోల్‌కతా : ‘‘ సేవ్‌ డెమొక్రసీ’’ పేరుతో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇస్తూ కోల్‌‌‌‌‌‌‌‌కతా హైకోర్టు ‌‌‌‌‌‌సింగిల్‌ ‌‌‌‌‌‌‌బెంచ్‌ ఇచ్చిన అనుమతిని డివిజన్‌ ‌‌‌‌‌‌‌బెంచ్‌ శుక్రవారం రద్దుచేసింది. బీజేపీ రథయాత్రల వల్ల రాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని మమతా బెనర్జీ సర్కార్‌‌‌‌‌‌‌‌ చేసిన వాదనను కొట్టేస్తూ బీజేపీ రథయాత్రకు సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి గురువారం అనుమతిచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ జస్టిస్ దేబాశిష్ కార్‌‌‌‌‌‌‌‌గుప్తా, జస్టిస్ షంపా సర్కార్ తో కూడిన డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

శుక్రవారం దీనిపై విచారణ జరిపిన బెంచ్‌…రాష్ట్ర ప్రభుత్వం అందించిన 36 ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌పుట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా రథయాత్రను నిలిపేస్తున్నట్లు చెప్పింది. వాస్తవాలను పరిగణలోనికి తీసుకోకుండా అంతకుముందు తీర్పు ఇచ్చినట్టు చీఫ్‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ దేబాశిష్ కార్‌‌‌‌‌‌‌‌గుప్తా చెప్పారు. గురువారం నాటి సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి తీర్పుతో బీజేపీ రథయాత్రకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసింది. మూడు రథయాత్రలు నిర్వహించాలని భావించిన బీజేపీ ముందుగా ఇవాళ (శనివారం) బీర్భుమ్‌‌‌‌‌‌‌‌ జిల్లా నుంచి తొలి యాత్రకు ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ అంశం వెకేషన్‌ ‌‌‌‌‌‌‌బెంచ్‌కు వెళ్లకుంటే జనవరి మొదటి వారంలో మాత్రమే ఇది విచారణకు రానుంది. కోల్ కతా హైకోర్టుకు శుక్రవారం నుంచి వింటర్‌‌‌‌‌‌‌‌ హాలిడేస్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates