దీదీ రెడ్ సిగ్నల్ : అమిత్ షా రథయాత్రకు అనుమతుల్లేవ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో తలపెట్టిన రథయాత్రకు మమత సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ కిశోర్‌ దత్తా కోల్‌కతా హైకోర్టుకు తెలిపారు. డిసెంబరు 7 నుంచి పశ్చిమ బెంగాల్ లో ర్యాలీలు నిర్వహించడానికి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. దరఖాస్తుపై ఆ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులు స్పందించక పోవడంతో.. బీజేపీ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది.  దీంతో స్పందించిన ప్రభుత్వం… కూచ్‌బెహర్‌ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఇలాంటి ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని.. అందుకే రథయాత్రకు అనుమతులను ఇవ్వలేదని హైరోర్టుకు తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 9 వ తారీకు తరువాత విచారణ చేపడతామని అప్పటివరకూ రధయాత్రను వాయిదా వేయాలని హైకోర్టు కోరింది. ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ పేరుతో డిసెంబరు 7నుంచి  పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బేహార్ నుంచి కక్ ద్వీప్ వరకు అమిత్ షా రథయాత్ర చేపట్టాలనుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates