IPL-మ్యాచ్-3 : బెంగుళూరు పై కోల్‌ కతా నైట్ రైడర్స్‌ విజయం

KKRIPL సీజన్ -11లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో RCB తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది కోల్‌ కతా నైట్ రైడర్స్‌. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన కోల్‌ కతా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు ఉండగానే విజయం సాధించింది. జట్టు సభ్యులు దినేశ్ కార్తిక్ 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా, సునీల్ నరేన్ 50, నితిశ్ రాణా 34 పరుగులు చేసి కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించారు.
సోమవారం (ఏప్రిల్-9) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో SRHతో RR తలపడనుంది.

Posted in Uncategorized

Latest Updates