బెటర్ మెంట్ కోసం : అసెంబ్లీలో లిక్కర్ బ్యాన్ పాలసీ ప్రవేశపెట్టిన నితీష్

లిక్కర్ బ్యాన్ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు బీహార్ సీఎం నితీష్ కుమార్. పేద ప్రజల అభ్యున్నతి కోసం కఠినంగానైనా అమలు చేయక తప్పలేదన్నారు నితీష్. మద్యం కారణంగా గృహ హింస ఎక్కువగా ఉండేదని.. క్రైమ్ రేటూ అంతకంతకూ పెరిగిందని గుర్తుచేశారు నితీష్. లిక్కర్ బ్యాన్ తో బెటర్ మెంట్ కోసం ప్రయత్నించానన్నారు బీహార్ సీఎం. లిక్కర్ బ్యాన్ తర్వాత డొమెస్టిక్ వయొలెన్స్, క్రైమ్ రేట్ చాలావరకు తగ్గిందని గణాంకాలు ప్రవేశపెట్టారు నితీష్. మద్యం తాగుతూ మొదటిసారి పట్టుబడ్డవాళ్లకు 50 వేల జరిమానా.. లేదా మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రెండోసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధించేలా సవరించారు. 2016 ఏప్రిల్ 1న లిక్కర్ బ్యాన్ పాలసీని తీస్కొచ్చారు నితీష్. రెండేళ్లలో మద్య వినియోగం 62 శాతం తగ్గిందన్నారు. ఈ రెండేళ్లలో 39 వేల మందికి పైగా కేసులు నమోదు చేశామన్నారు. ADRI సర్వే ప్రకారం లిక్కర్ బ్యాన్ తర్వాత… మద్యంపై ఖర్చు చేసే మొత్తాన్ని ఆహారం, బట్టల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నట్టు తేలింది.

Posted in Uncategorized

Latest Updates