బెట్టింగ్, జూదం లీగల్ చేసేద్దామా : లా కమిషనే సిఫార్సు

BETTINGజూదం, బెట్టింగ్ పై కేంద్రానికి సంచలన నిర్ణయాన్ని వ్యక్తపరిచింది లా కమిషన్. వీటిని చట్టబద్దం చేయాలంటూ స్వయానా లా కమిషనే సిఫార్సు చేసింది. బెట్టింగ్ నిషేధించడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని తెలిపిన లా..చట్టబద్దం చేయడంతో నల్లధనం పెరిగి మార్కెట్లోకి చలామణి అవుతోందని చెప్పింది. వీదేశాల్లో బెట్టింగ్ చట్టబద్దం కావడంతోనే అభివృద్ధితో దూసుకెళ్తున్నాయని, అక్కడి ప్రజలు సంతోషంగా గడుపుతున్నట్లు వివరించింది. జూదం ఆడితే ఆదాయం పెరగుతుందని.. దానిపై టాక్స్ విధించవచ్చని సిఫార్సులో తెలిపింది. దీంతో ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూరుతుందని సలహా ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ లా కమిషన్‌ జూదం ఆడి ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడు గానీ ..ఇప్పుడు మనం పైసలు గెల్చుకోవచ్చు. అదీ దొంగచాటుగా కాదు, రైట్‌ రాయల్‌ గా అని చెప్పింది లా కమిషన్‌.

లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌

గేంబ్లింగ్‌ అండ్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ ఇన్‌ క్లూడింగ్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా పేరిట జస్టిస్‌ BS చౌహాన్‌ కమిటీ ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. చట్టంలో చేయాల్సిన మార్పులను అందులో సూచించారు. బిహార్‌, ఒడిషా క్రికెట్‌ సంఘాలకు, BCCIకి మధ్య సాగుతున్న ఓ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెట్టింగ్‌ ను చట్టబద్ధం చేయడం సాధ్యమా అన్న అంశంపై పరిశీలన జరపాలని చేసిన ఆదేశాల మేరకు కమిటీ ఈ నివేదిక రూపొందించింది. విద్యార్థులు, నిపుణులు, ప్రముఖుల, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదట బెట్టింగ్‌ ను నిషేధించడం కన్నా నియంత్రించడం మేలన్న తుది నిర్ణయానికి వచ్చింది. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాలపై వచ్చే ఆదాయంపై పన్ను విధించాలన్న సిఫార్సు వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందంటున్నారు.

నల్లధనం విపరీతంగా చలామణీ అవుతున్న ప్రస్తుత తరుణంలో మనమే చట్టబద్ధం చేసేస్తే ఆ వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది అని వింత వాదన వినిపిస్తోంది. నైపుణ్యం గల క్రీడ అన్న పేరుతో గుర్రప్పందాల మీద బెట్టింగ్‌కు అనుమతిస్తున్నారు. ఇలాగే నైపుణ్యం గల క్రీడలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ గ్యాంబ్లింగ్‌-నిషేధ చట్ట పరిధి నుంచి తప్పించి చట్టబద్ధత కల్పించవచ్చు అని కమిషన్‌ సూచించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులు చేసి కేసినోలను, ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పరిశ్రమలను భారత్‌ కు రప్పించవచ్చు అని కూడా సిఫార్సు చేసింది. అనుమతులు మంజూరు చేసేటపుడు చాలా నియంత్రణలుండాలని కమిషన్‌ సూచించింది. నిర్దిష్ట లైసెన్సులున్నవారికే అనుమతులివ్వాలని, లైసెన్సులు మంజూరు చేసే ప్రభుత్వాధికారికి కూడా నిర్దిష్ట బాధ్యతలుండాలని, నెలవారీ లావాదేవీలకు లెక్కా పత్రం ఉండాలని, ప్రతీ లావాదేవీ నగదు-రహితంగా జరగాలని కోరింది.

సో ..ఇదే కనుక అమల్లోకి వస్తే.. బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోండని ప్రభుత్వమే పేకాటరాయుళ్లు, జూదగాళ్లను దగ్గరుండి క్లబ్బులకు పంపబోతోందన్నమాట.

Posted in Uncategorized

Latest Updates