బెయిల్ మంజూరైనా జైల్లోనే డేరా బాబా

డేరా సచ్చా సౌధ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శుక్రవారం(అక్టోబర్-5) బెయిల్ మంజూరైంది. పంచకుల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే… ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనా, అత్యాచారం కేసులో ఆయన జైల్లోనే ఉండనున్నాడు. అంతకుముందు… ఆగస్ట్ 23వ తేదీన ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో డేరా బాబా స్పెషల్ CBI కోర్టు ఎదుట బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం CBI కోర్టు జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

తన దగ్గర పని చేసే ఇద్దరు సాద్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Posted in Uncategorized

Latest Updates