బెర్త్ కన్ఫర్మేషన్‌ : ఇక టికెట్ బుక్ చేసుకున్నప్పుడే సమాచారం

BERTH RAILWAYరైల్వే టికెట్ బుకింగ్స్ లో సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది రైల్వేశాఖ. ఇప్పటివరకు రైల్వే టికెట్స్ బుక్ చేసుకున్నాక బెర్త్ దొరుకుతుందా..లేదా అనే దానిపై ప్రయాణికులకు తలెత్తుతున్న సమస్యలపై కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇకమీదట  టికెట్ బుక్ చేసుకున్నాక బెర్త్ దొరుకుతుందా..లేదా.. అనే ఆందోళన ఇక అవసరంలేదు. బుకింగ్ తీరుతెన్నులను బట్టి టికెట్ రిజర్వు చేసుకోగానే మీ బెర్త్ కన్ఫమ్ అయ్యే అవకాశాలను తెలుసుకోవచ్చు.

ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సై ట్‌ను ఆధునికీకరించి, సోమవారం (మే-28) అర్ధరాత్రి నుంచే అమల్లోకి తెచ్చింది. ఈ వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS ) అభివృద్ధి చేసింది. గతం లో వెయిటింగ్ లిస్ట్, RAC ప్రయాణికులకు చివరి నిమిషం వరకూ బెర్త్ కన్ఫర్మేషన్‌ పై గందరగోళం ఉండేది. ప్రస్తుతం ప్రతి రోజు బుకింగ్ తీరును బట్టి బెర్త్ దొరుకుతుందా.. లేదా.. అని విషయం వెంటనే తెలిసిపోతుంది. గత 13 ఏళ్ల డాటా ఆధారంగా ఈ వెబ్‌ సైట్‌ ను ఆధునీకరించినట్లు తెలిపాయి రైల్వే వర్గాలు.

Posted in Uncategorized

Latest Updates