బెలూన్ కోసం గొడవ.. పిల్లల్ని చంపి తానూ ప్రాణాలు తీసుకుంది

బెలూన్ కోసం జరిగిన ఓ చిన్న గొడవ నలుగురి ప్రాణాలను బలితీసుకొంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో జరిగింది. జిల్లాలోని బవాస్ పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నిర్మలకు ముగ్గురు పిల్లలు. నిన్న(గురువారం) నిర్మల పెద్ద కొడుకు అంచల్(5) బెలూన్ కొనివ్వమ్మని వాళ్ల నానమ్మను అడగ్గా.. నాన్న వచ్చేటప్పుడు బెలూన్ తీసుకొస్తాడంటూ ఆ పిల్లాడిని సముదాయించింది. అయితే ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది.

దీంతో మనస్థాపం చెందిన నిర్మల తన ముగ్గురు  పిల్లలను తీసుకుని గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.  పిల్లలకు విషం ఇచ్చి, తాను కూడా విషం తాగింది. నిర్మలతో సహా ముగ్గురు పిల్లలకీ వాంతులు కావడంతో నిర్మల అత్త… కొడుకుకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అతను వెంటనే ఇంటికొచ్చి నిర్మలను, పిల్లలను స్థానిక హాస్పటల్ కు తరలించాడు. అయితే వారి  పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే జిల్లా ఆస్పత్రికి చేరేలోపే నలుగురూ చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates