బైక్‌తో సహా డ్రైనేజీ గుంతలో పడిన వ్యక్తి

bykeeహైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్ గేట్ ముందు ప్రమాదం తప్పింది. గురువారం (ఫిబ్రవరి-8) ఓ వ్యక్తి డ్రైనేజ్ లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అక్కడున్న సిబ్బంది గుర్తించి అతన్ని బయటకు లాగడంతో గండం నుంచి గట్టెక్కాడు.

సెక్రెటేరియట్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మత్తులు జరుగుతున్నాయి. బైక్ పై దూసుకొచ్చిన యువకుడు.. డ్రైనేజ్ లో పడిపోయాడు. అక్కడున్న వారు గమనించడంతో ప్రమాదం తప్పింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది.

Posted in Uncategorized

Latest Updates