బైక్‌ ను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి

accసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీన్‌పూర్ కృష్ణారెడ్డిపేట ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates